Nagesh kavitha
స్వరాజ్యం - సురాజ్యం
ఆసేతు హిమాచలం, ఆ అఖండ భారతం
ఎగసిన యువకెరటాలు, త్యాగాలు
బలిదానాలు, ఉరికంబాలు
ఒక్కొక్కటిగా దారికట్టాయి
నూనూగు మీసాలు మెలివేసి సవాల్ చేశాయ్.
వడికిన నూలు, తిప్పిన చట్రం
అతివాదం-మితవాదం, అహింసా-ఆగ్రహం
చట్టాపట్టాలేసుకొని చేసిన పోరాటం
స్వరాజ్యం రావాలని
సురాజ్యం చేయాలని
పిడికిలెత్తిన చేతులకి సంకెళ్లు
నినదించిన గొంతులకి జైళ్ళు
ఎదిరించిన గుండెలకి తుపాకీ గుళ్ళు
బంధనాలు లేని రగిలించిన స్పూర్తి
స్వతంత్ర వాయువులు విస్తరించాయి
స్వరాజ్య కాంక్షలు ప్రజ్వరిల్లాయి
ఏ తల్లి కన్నబిడ్డడి బలిదాన ప్రతిఫలమో
ఏ ముదసలి ఊతకర్ర శక్తియో
ఇచ్చిన వారు లేరు, తెచ్చిన వారు లేరు
స్వరాజ్యం రావాలని
సురాజ్యం తేవాలని
ప్రపంచీకరణ లో
ప్రపంచమే కుగ్రామం
“దేశం” సంకుచిత భావన?
మనుషులమైతే మేమే
ఆలోచనలు మావికాదు
దేశమైతే ఇదే, దేశభక్తి కానేకాదు
మా కోసం మీ పోరాటం తప్పే
మా కోసం మీ ఆరాటం తప్పే
కర్జన్ ఇంటిపక్క, వెలసిన మనోడి బంగ్లా
వాళ్ళ తాతల వైరమంతా
చరిత్రలో ప్రకటించబడ్డాయి, ప్రత్యేకించబడ్డాయి
ఏ స్వరాజ్యం రావాలని ?
ఏ సురాజ్యం తేవాలని ?
©®
చిన్న నాగేష్
9885716943
కోడుమూరు
కర్నూలు జిల్లా
Comments
Post a Comment