హఠాత్తుగా మొన్నటికి నిన్నటికి నిన్నటికి నేటికి జరిగిన మార్పేదైనా అది హఠాత్తుగా నాతో కలగలసిన జతగాడు, ఊహలు ఊసూలు పంచుకున్న నేస్తగాడు నేడు వైరమెత్తాడు రచ్చబండ కాడ ఏండ్లుడికిన యాప సెట్టు తాతల తండ్రుల జ్ఞాపకాల సేతువు నేడు మాయమయ్యే గాలివానకి ఒరిగిన ముసలి మొక్క వేర్ల మీద నిన్న మొలిచిన పల్లవాలు నేడు వాడుపట్టెను పురాతన గుడి తలుపులపై పడిన పసుపు మరకలకు సాక్ష్యం వెలిగిన దీపం నేడు కనుమరుగయ్యే విధి విసిరిన మైక్రో బయో మిస్సైల్ ధాటికి సమాదుల దిబ్బలతో యావత్ ప్రపంచం నేడు విలవిలలాడే కుల జాతి దేశ విభేదాల మద్య నిత్యం కలబడుతూనే కలిసిపోయే జీవితాలు నేడు ఐసోలేషన్లో చేరే నిన్నటికి నేటికి జరిగిన మార్పేదైనా అది హఠాత్తుగా ©® నాగేష్ చిన్న కోడుమూరు కర్నూలు జిల్లా 9885716943
Comments
Post a Comment