Posts

Showing posts from February, 2018

Nagesh chinna

ఉషోదయం కనుపాప నలుపు వెనక వింత ప్రపంచం గుళాబీ రేకు పదును శ్వేత స్పటిక లింగానికైన గాయం గోమందల పాదధూళి ప్రవాహం గాలితో వస్తున్న ఎడారి పొరలా కమ్మింది పోతపోసిన పొగను చుట్టేసిన చలికాలపు ఉదయం గడ్డిపొదల చెక్కిలపైన చల్లిన వెండితడి కొండకు పెట్టిన రంద్రం నుండి అమాంతం కిందకు దూకిన ఉషోదయ కిరణాల వెల్లువ చీకట్లో పడిపోతూ మంచుతెరను తెంచలేక సోమరిగా ఉరుకుతుంది. దిగులుగా ఉన్న నలుపు పైకి రంగుల ఫిరంగులు ఎక్కుపెట్టింది వయ్యారాలు ఒలకబోయిన నీటిని ఢీకొట్టిన గుళకరాళ్ళ కుప్ప శీతల మేఘాలు ఇసుకతెన్నెలకు దూదిపరుపై ఎర్రతురాయిపూల కేసరాలు ఎదురుతిరిగి కొక్కెలతో పెనవేసుకొంది నీటి చారికల అలలాకార గీతల ఓడెక్కిన కువేణి మెడకేసిన బేస్త మెలితిరిగిన ఫ్లెమింగో తల ఊగిసలాట మనస్సు నుసులుతూనే ఆలోచనల కుసులు ఒక్కొక్కటి జారుతూనే చిన్న నాగేష్ కోడుమూరు 9885716943

నా కవిత నాగేష్ చిన్న

రోజురోజుకీ సమీకరణాల మార్పు చూసే కోణాన్ని బట్టి నమ్మే సిద్దాంతాన్ని బట్టి ప్రయాణించిన దూరం గతించిన కాలం మనిషి సాగించిన, కొనసాగించిన జీవనయాత్ర... భిన్న దృవాలు కలిసిపోతున్నట్టూ శూన్యం ఆవరిస్తున్నట్టూ అనుసరించిన హింస వెంటబడి వెక్కిరిస్తే... తొలగించిన పదవిలో బతిమాలి కూర్చోబెడ్తే ఉధ్యమాల మెట్లెక్కి దర్నాల బాటపట్టి దర్నాచౌక్ ని తొలగిస్తే సమీకరణలు మారుతున్నాయ్ రోజురోజుకీ ప్రపంచ సమస్యలు - ప్రాంతీయ సమస్యలై ప్రాంతీయ సమస్యలు ప్రపంచాన్ని తాకాయ్ సాంస్క్రతిక పునఃజీవనం ముసుగేసుకు మూలకూచ్చుంది చూసే కోణాన్నిబట్టి నమ్మేసిద్దాంతాన్ని బట్టి లాభనష్ఠాల నడుమ నడ్డీ విరిగిన సేద్యం రైతేరాజన్న రాజ్యాలు రాజు చేతికి బేడీలేసాయ్... దేశం వదిలేసిన ఆర్థిక నేరగాళ్ళ అర్హతకు దరఖాస్తులు వెల్లువెత్తాయ్ గతించిన కాలం, ప్రయాణించిన దూరం సాగించిన, కొనసాగించిన జీవనయాత్ర తిరగబడి తలకిందులైంది మనోధైర్యానికి, ఆత్మభావనకి ఆసరా కరువైంది కష్ఠాల గుచ్చం కన్నీటి ధారను ఏకరవుపెట్టింది మార్పుల సమీకరణాలు ఆగలేదు చూసే కోణాన్నిబట్టి నమ్మే సద్దాంతాన్ని బట్టి..... చిన్న నాగేష్. 9885716943

Nagesh chinna

Image